విద్యా బాలన్ బరువు గురించి, విద్యా బాలన్ శరీర కొలతలు గురించి ట్రోలర్స్ కామెంట్స్ చేయడం కొత్తేమి కాదు. విద్యా బాలన్ కి ఇలాంటి కామెంట్స్ వినడం ఆనవాయితీ అయిపోయింది. ఐతే, తాజాగా విద్యా బాలన్ మళ్లీ బాడీ షేమింగ్ కి గురి అయ్యింది. ఈ సారి కాస్త ఘాటుగానే. హీరోయిన్లు కూడా మనుషులే కదా. వాళ్లకు కొన్ని సమస్యలు ఉంటాయి. అయినా, హీరోయిన్ల బరువు గురించి, శరీర కొలతలు గురించి ట్రోలర్స్ ట్రోలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ?. అయినా, 40 ఏళ్లకు కూడా ఇంకా అందంగా, సన్నగా.. నాజూగ్గా ఉండాలంటే ఎలా కుదురుతుంది ?. ప్రస్తుతం ట్రోలర్స్ విద్యా బాలన్ పై పడ్డారు. హీరోయిన్ గా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన విద్యా బాలన్ ఇప్పుడు ఇంకా బాగా లావు అవుతుందట. అయితే ఏంటి ?, సోషల్ మీడియాలో విద్యా బాలన్ బాడీ పై ప్రస్తుతం ట్రోలింగ్ ఎక్కువైంది.
ఒక్క విద్యా బాలన్ మాత్రమే కాదు, దాదాపు హీరోయిన్లు అందరూ ఈ సమస్యని ఎదుర్కుంటూనే ఉన్నారు. ఆరోగ్య సమస్య కారణంగా ఆ మధ్య హీరోయిన్ సోనాక్షి సిన్హా లావు పెరిగింది. అంతే, సోనాక్షి సిన్హా పై విరుచుకుపడ్డారు. రీసెంట్ గా అనుష్క శెట్టి కాస్త బొద్దుగా మారి కనిపించింది. నిన్నటి వరకూ అనుష్క శెట్టి లుక్ పై అనేక కథనాలను వైరల్ చేస్తూనే వచ్చారు. అలాగే హీరోయిన్ కమలిని ముఖర్జీ ని సైతం నెటిజన్లు వదిలి పెట్టలేదు. ఆమె లుక్ ఏదో బాగా మారిపోయింది అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. ఇక నేడు విద్యా బాలన్ వంతు వచ్చింది. విద్యా బాలన్ ఏమైనా యంగ్ హీరోయినా ?, కాదుగా!. అయినా, ట్రోలర్స్ మాత్రం విద్యా బాలన్ ని వదిలిపెట్టడం లేదు. విద్యా బాలన్ బాడీ పై ఫన్నీగా మీమ్స్ చేస్తూ జోక్స్ పేలుస్తున్నారు. ఏదో జోక్స్ చెయ్యడం వరకు ఓకే కానీ, విద్యా బాలన్ ని కించపరిచేలా మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు.
విద్యా బాలన్ పై ప్రస్తుతం ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం లావు పెరడగం కారణంగా విద్యా బాలన్ గత కొన్నేళ్లుగా దారుణమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది. విద్యా బాలన్ చాలా కాలంగా బరువు సమస్యని ఎదుర్కొంటున్న మాట నిజం. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల విద్యా బాలన్ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోతోంది. అందుకే, విద్యా బాలన్ సినిమాలు కూడా పూర్తిగా తగ్గించింది. ఐతే, విద్యా బాలన్ లేటెస్ట్ ఫోటోల్లో కాస్త లావు పెరిగింది.
ఆ ఫొటోల్లో విద్యా బాలన్ ముఖం ఉబ్బి ఉందని, ఆమె బాగా లావు అయింది అని అంటూ మొదలు అయిన కామెంట్స్, మెల్లగా అసభ్యకరంగా మారాయి. ఏకంగా విద్యా బాలన్ ఫోటోలని, రకరకాల వస్తువులతో పోల్చుతూ… అలా ఉంది అంటూ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. విద్యా బాలన్ బద్ధకం వల్ల లావు తగ్గలేకపోతుంది అనుకుంటే పొరపాటు. విద్యా బాలన్ కి ఆరోగ్య సమస్య ఉంది. ఈ విషయం తెలిసి కూడా ట్రోలర్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ తప్పు అని ఎంత మొత్తుకుంటున్నా ట్రోలర్స్ మారడం లేదు. మొత్తమ్మీద తాజాగా విద్యా బాలన్ ట్రోలింగ్ కి మళ్లీ బలి అయింది.