మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతో బీజీగా ఉన్నాడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా ఆయన ఒక కొత్త హీరోను పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది.
ఒక వ్యాపార వేత్త తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి రంగంలోకి దిగాడట. 170 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కు పారితోషికంగా 35 కోట్లు ముట్టనున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ తరువాత చరణ్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయవలసి వుంది. ఆ ప్రాజెక్టు ఆలస్యమైతే త్రివిక్రమ్ ఈ కొత్త హీరోతో సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.