HomeTelugu Big Storiesఆ స్టార్‌ హీరోలతో త్రివిక్రమ్‌ మల్టీస్టారర్‌!

ఆ స్టార్‌ హీరోలతో త్రివిక్రమ్‌ మల్టీస్టారర్‌!

Trivikram multi starrer movడైరెక్టర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా కోసం మహేష్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడే త్రివిక్రమ్‌ తదుపరి సినిమాపై చర్చ మొదలైంది.

అసలైతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరొక సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ ప్రకటించారు. అయితే బన్నీ ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ బన్నీతో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులను అన్నీ దాదాపు కంప్లీట్‌ చేసుకున్నాడట.

అయితే ఇప్పుడు గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్‌ కోసం దాదాపు 8 నెలలు వెయిట్‌ చేయాలంట. అయితే ఈ గ్యాప్ లో ఏదైనా కొత్త ప్రొజెక్ట్‌ చేస్తాడా అనే అనే సందేహాలు వస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఒక మల్టీ స్టార్ మూవీ ప్లాన్‌ చేస్తున్నాట్లు టాక్‌.

Trivikram multi

అది కూడా కామెడీ&ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌. మొన్నటి వరకు త్రివిక్రమ్ నాని కాంబో అంటూ రూమర్స్ సౌండ్ కాస్త ఎక్కువగానే వినిపించింది కానీ అందులో ఎలాంటి నిజం లేదని కూడా సన్నిహిత వర్గాల ద్వారా క్లారిటీ వచ్చేసింది. అయితే వెంకటేష్ తో కూడా ఒక సినిమా అయితే చేయాల్సి ఉంది.

పదేళ్ళ నుంచి ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలు ఎక్కడం లేదు. ఇక ఆయనతో పాటు మరొక హీరో రామ్ తో కూడా సినిమా చేస్తారు అని స్రవంతి రవి కిషోర్ కు ఎప్పుడో మాట ఇచ్చారు. బహుశా ఇద్దరితో మల్టీస్టారర్ ప్రాజెక్టు రావచ్చు అని టాక్.

ఏదేమైనా వెంకటేష్ తో మాత్రం త్రివిక్రమ్ మల్టీస్టారర్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వెంకటేష్‌- నాని తో ఏమైన మల్టీస్టారర్‌ చేసే ఛాన్స్‌ ఉందా అనే వార్తలు వినిపిస్తున్నారు. కాగా వెంకటేష్ ఇప్పటికే పలు మల్టీస్టారర్‌ మూవీస్‌ చేశాడు. దీంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. మరి ఈ వార్తలల్లో నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!