అల్లు అర్జున్ తో మరోసారి త్రివిక్రమ్ మూవీ

ప్రస్తుతం త్రివిక్రమ్ .. సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లిందనే విషయం తెలిసిందే. అయితే షూటింగ్‌ పరంగా మరింత ఆలస్యం కాకుండా త్రివిక్రమ్ పక్కా ప్లానింగ్ చేసుకునే రంగంలోకి దిగాడని అంటున్నారు.

ఈ క్రమంలో త్రివిక్రమ్‌ తరువాతి సినిమా ఎవరితో ఉండొచ్చుననేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘జులాయి’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ .. ‘అల వైకుంఠపురములో’ సినిమాలు వచ్చాయి. ఈ మూడూ కూడా ఒకదానికి మించి మరొకటి విజయాన్ని సాధించాయి.

ఇక ‘పుష్ప’తో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది. అందువలన అల్లు అర్జున్ తో పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్ మరో ప్రాజెక్టు సెట్ చేశాడని అంటున్నారు.ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నారని టాక్. ఆల్రెడీ కథ వినిపించడం జరిగిపోయిందనీ, ఈ వేసవిలో పూజా కార్యక్రమాలు ఉంటాయని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో షాహిద్ కపూర్ కీలకమైన పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu