గత కొంతకాలంగా త్రివిక్రమ్, రామ్ చరణ్ తో ఓ సినిమా తీయబోతున్నాడని దాన్ని పవన్
కల్యాణ్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు అభిమానులు ఎంతగానో
సంతోష పడ్డారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే సమయం పట్టేట్లు ఉంది.
ప్రస్తుతం చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘దృవ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా
తరువాత సుకుమార్ తో ఓ సినిమా చేయడానికి చరణ్ కమిట్ అయ్యాడు. అలానే మణిరత్నం,
కొరటాల శివలతో చెర్రీ తదుపరి చిత్రాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ పూర్తవ్వడానికి
కనీసం రెండేళ్ళు పడుతుంది. అలానే త్రివిక్రమ్ కూడా ముందుగా పవన్ కల్యాణ్ తో ఓ సినిమా,
తరువాత మహేష్ బాబుతో మరో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. సో.. చరణ్, త్రివిక్రమ్ ఫ్రీ
అవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి అన్నీ కుదిరితే 2019లో వీరిద్దరి కాంబినేషన్
సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.