స్టార్ హీరోయిన్, మోస్ట్ టాలెంటెడ్ త్రిష వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఓ వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూనే, మరో వైపు లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజను ప్రాజెక్టుల వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. స్టార్ హీరో అజిత్ సరసన మరో మూవీలో నటిస్తోంది. కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న మూవీతో పాటు మోహన్‌లాల్, రామ్ మూవీలోనూ నటిస్తోంది.
‘ది రోడ్’ మూవీలో త్రిష ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ చాలా కాలం క్రితం ‘మధురై’లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈసినిమాలో త్రిష ఓ జర్నలిస్టుగా కనిపించనుంది. ఇది ఓ రివెంజ్ స్టోరీ. అరుణ్ వశీగరన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ది రోడ్ మూవీని అక్టోబర్ 6న రిలీజ్ చేయబోతున్నారు. తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేసేందుక సన్నాహాలు చేస్తున్నారు.