తమిళ బ్యూటీ త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది రోడ్ . రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం తమిళంలో మాత్రమే విడుదలైంది. దీంతో తెలుగు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. తాజాగా వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది ఈ మూవీ టీమ్. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఆహాలో ప్రీమియర్ కానుంది. నవంబర్ 10న ఆహాలో స్ట్రీమింగ్ షురూ కానున్నట్టు తెలియజేసింది.
దీంతో త్రిష ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ వసీగరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్‌గా పాపులర్ అయిన మాలీవుడ్ యాక్టర్ షబీర్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కించారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు. త్రిష ప్రస్తుతం లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటిస్తోన్న KH234లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. అదేవిధంగా అజిత్ కుమార్ కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్‌గా ఫైనల్ అయింది.