Brinda OTT:
సీనియర్ స్టార్ నటి త్రిష కృష్ణన్ ఈ మధ్యనే బృందా అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ లలో కూడా అడుగుపెట్టింది. సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించిన బృందా వెబ్ సిరీస్ ఆగస్టు 2న సోనీ లైవ్ లో విడుదలైంది.
ప్రమోషన్ లేకపోయినా, ఈ సిరీస్ మంచి స్పందన వచ్చింది. సీరియల్ కిల్లర్స్ గురించి సాగే ఈ కథ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంది. ప్రతి ఎపిసోడ్ దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుంది.
ఈ సిరీస్ మొత్తం మూఢనమ్మకాలు, వాటి ప్రభావాల మీద ఆధారపడి ఉంటుంది. సెన్సిటివ్ టాపిక్స్ అయినా కూడా సూర్య ఈ అంశాలను సున్నితంగా, చాలా జాగ్రత్తగా డీల్ చేసారు.
సీరియల్ కిల్లర్ జానర్‌లో నేరాలను బాగానే చూపించారు. ఇందులో క్రైమ్ జరిగిన ప్రదేశంలో చూపించిన అరుదైన పక్షిని కోసం వాడిన CGI అంత బాగా అనిపించలేదు. సీరీస్‌లో ట్వీట్ లు ఎక్కువగా ఉన్నా కూడా.. ప్రధాన కథనానికి అంత సెట్ అవ్వలేదు అనే భావన వస్తుంది. స్క్రీన్ ప్లే ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటే బావుండేది.
మొదటి ఎపిసోడ్‌లోనే కిల్లర్ ముఖం చూపించేయడంతో చాలా మందికి ఇంట్రెస్ట్ పోతుంది. కొంత నిరాశ కలుగుతుంది. బృంద సోదరి, సారథి మధ్య సీన్స్ బాగా క్లిక్ అవ్వలేదు. కేరెక్టర్ డెవలప్మెంట్ కూడా అంత బాగాలేదు అని చెప్పుకోవచ్చు.
కథలో లోతు లేకపోవడం కూడా మైనస్ పాయింట్ గా మారింది. త్రిష తక్కువ మేకప్‌తో కూడా చాలా అందంగా ఉండటమే కాక నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది. రవీంద్ర విజయ్ సారథి పాత్రలో, ఆనందసామి కిల్లర్ పాత్రలో బాగానే నటించారు.
మొత్తం మీద, ‘బృంద’ ఒక మంచి తెలుగు OTT సిరీస్‌గా నిలిచింది. నిజానికి త్రిష నటించిన ఫిమేల్ సెంట్రిక్ కథలు ఇప్పటిదాకా ఎప్పుడు పెద్దగా వర్కౌట్ అవలేదు. కానీ ఈ సిరీస్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.