HomeTelugu Trendingక్షమాపణలు చెప్పిన మన్సూర్‌.. స్పందించిన త్రిష

క్షమాపణలు చెప్పిన మన్సూర్‌.. స్పందించిన త్రిష

trisha response on mansoor
ప్రముఖ నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మూవీ ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషను రేప్ చేసే సీన్ ఉంటుందని తాను భావించానని… అయితే ఆ సీన్ లేకపోవడంతో తాను చాలా నిరాశపడ్డానని ఆయన అన్నారు.

ఈ అసభ్యకర వ్యాఖ్యలపై సెలబ్రెటీలతో పాటుగా జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్ పై విచారణ చేయాలని ఆదేశించింది. మరోవైపు చెన్నై పోలీసులు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు.

ఈ క్రమంలో త్రిషకు మన్సూర్ క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో త్రిష స్పందిస్తూ… తప్పు చేయడం మానవ సహజమని… దాన్ని మన్నించడం దైవగుణమని అన్నారు. దీంతో, ఈ వివాదానికి ముగింపు కార్డు పడినట్టయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu