హీరోయిన్ త్రిష 37 ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కెరీర్ పైనే పూర్తిగా దృష్టి సారించింది. అప్పుడప్పుడు ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నే ఉంటాయి. తాజాగా ఇదే విషయమపై ఇస్టాగ్రామ్ లైవ్‌లో త్రిషను ఓ అభిమాని కొంటె ప్రశ్న వేశాడు. మీ జీవిత భాగస్వామి దొరికారా? అని అడిగాడు. దీనికి సమాధానంగా… ‘ఇంకా అతన్ని కలవలేదు’ అని త్రిష చెప్పింది.
గతంలో ఓ సంబంధం త్రిష పెళ్లి వరకు వెళ్లింది. 2015లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దైంది. మరోవైపు, తెలుగు హీరో రానాతో డేటింగ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి.