త్రిష పెళ్లి వార్తలపై కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

హీరోయిన్ త్రిష పెళ్లి గురించి కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ బ్యూటీ 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతుందని సినీ జనాలు కోడై కూస్తున్నారు. దీనిపై త్రిష స్పందించింది. నేరుగా స్పందించకపోయినా పరోక్షంగా తన నెక్ట్స్ మూవీ లియో డైలాగ్ స్టైల్లో ఆమె రియాక్ట్ అవుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

దళపతి విజయ్‌తో కలిసి త్రిష నటిస్తున్న లియో మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దానిపై ఉన్న డైలాగ్ అప్పుడే పాపులర్‌గా మారిపోయింది. “కీప్ కామ్ అండ్ ప్రిపేర్ ఫర్ బ్యాటిల్” అనే డైలాగ్ ఆ పోస్టర్ పై ఉంది. ఇప్పుడు అలాగే త్రిష కూడా తన పెళ్లి పుకార్లపై స్పందించడం విశేషం.

కేరళకు చెందిన ప్రొడ్యూసర్‌తో త్రిష పెళ్లి జరగబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. త్రిష వీటిపై పరోక్షంగా స్పందించింది. “డియర్.. నువ్వెవరు, నీ టీమ్ ఎవరన్నది నీకు తెలుసు. కామ్ గా ఉండండి.. రూమర్లు ఆపండి” అని త్రిష ట్వీట్ చేయడం విశేషం.

త్రిష నటించిన మరో సినిమా ది రోడ్ అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2లోనూ త్రిష కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఒకే ఏడాది త్రిష 3 సినిమాల్లో నటించడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu