స్టార్ హీరోయిన్ త్రిషపై గతంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఎంతటి సంచలనం హైకోర్టు వరకు ఈ విషయం వెళ్లింది. మన్సూర్‌కు న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. తాజాగా, త్రిషపై తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
ఓ ఎమ్మెల్యే త్రిషకు రూ.25లక్షలు ఇచ్చి రిసార్ట్‌కు తీసుకవచ్చాడు అనడంతో పాటు మరిన్ని అభ్యంతర కామెంట్లు చేశారు. దీంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా త్రిష కూడా ఈ విషయంపై స్పందించారు. అసభ్య కామెంట్లు చేసిన ఏవీ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని త్రిష వెల్లడించారు. ఇలాంటి నీచమైన మనుషులను పదేపదే చూడడం అసహ్యంగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు. కఠినమైన చర్యలకు దిగుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘దృష్టిని ఆకర్షించేందుకు ఏ స్థాయికైనా దిగజారిపోయే హేయమైన మనుషులను, నీచమైన జీవితాలను పదేపదే చూడడం అసహ్యంగా ఉంది. కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటా. మిగిలినది నా లీగల్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది’ అని త్రిష ట్వీట్ చేశారు.
ఇక త్రిష విషయానికొస్తే నాలుగు పదుల వయసులోనూ అదే అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ ఈ బ్యూటీ. రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా పొన్నియన్ సెల్వన్, లియో వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరలోనూ హీరోయిన్ గా నటిస్తుంది.