ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. భారీ తారాగాణంతో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్‌డేట్‌లను ఇస్తుంది. ప్రతిరోజు ప్రధాన నటీనటుల పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని త్రిష ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో త్రిష కుందవాయి పాత్రలో నటించనున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్ త్రిష అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే విడుదలై ఐశ్వర్యరాయ్, కార్తి, విక్రమ్‌ల ఫస్ట్‌లుక్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి పలువురు స్టార్లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. ఈ చిత్ర మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. కాగా ఈ సినిమా టీజర్ జూలై 7న తంజావూరులోని బృహదేశ్వరా టెంపుల్‌లో విడుదల చేయనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
In a world of men, a woman of courage. Presenting Princess Kundavai! #PS1 releasing in theatres on 30th September in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada! 🗡️@LycaProductions #ManiRatnam @arrahman pic.twitter.com/DgqCVNNrnB
— Madras Talkies (@MadrasTalkies_) July 7, 2022