నటి త్రిష పెటా సంస్థకు ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెటా నిర్వహకుల కారణంగానే సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేదం విధించింది. త్రిష కూడా జల్లికట్టు విషయంలో తన నిరసన భావాన్ని వ్యక్తం చేసింది. దీంతో తమిళులు త్రిషపై మండిపడ్డారు. వారి దాడి తట్టుకోలేక తాత్కాలికంగా ట్విట్టర్ నుండి తప్పుకుంది. దాదాపు ట్విట్టర్ లో ఆమెకు ముప్పై రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నాయి. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పిన ఈ బ్యూటీ ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ కూడా చేసింది. వెంటనే ట్విట్టర్ నుండి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
అసలు విషయంలోకి వస్తే జల్లికట్టుపై త్రిష స్పందించిన తీరుపై తమిళులు ఆమెపై విరుచుకుపడ్డారు. నేను కూడా తమిళ అమ్మాయినే అని చెప్పినప్పటికీ వారు త్రిషను ఏ మాత్రం కన్సిడర్ చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా త్రిష చనిపోయిందంటూ.. పోస్టర్స్ కూడా అతికించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆమె సినిమాలు విడుదలవ్వకుండా అడ్డుకుంటామని బెదిరిస్తున్నారు. త్రిషకు కొందరు తారలు సపోర్ట్ చేస్తున్నారు. జల్లికట్టు సమర్ధుడైన కమల్ హాసన్, త్రిషను వదిలేయాలని సూచించారు. కమల్ హాసన్ కూడా ఆమెపై వ్యంగ్యంగా స్పందిస్తూనే వదిలేయమని ట్వీట్ చేశారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ త్రిష ఇప్పటికీ ఆమె అభిప్రాయాలకు కట్టుబడి ఉండడం తన భావస్వేచ్చను తెలియజేస్తోంది.