HomeTelugu Trendingఆ విషయంలో పెద్దల మాట వినను

ఆ విషయంలో పెద్దల మాట వినను

10 10
పెళ్లికాని ముదురు భామల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ భామ ప్రస్తుతం తమిళ్ లో అడపాదడపా సినిమా లు చేస్తుంది. ఇక త్రిష మూడుపదుల వయసు దాటి ఆరు సంవత్సరాలు అయిపోయింది అయినా పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు ఈ చెన్నై చిన్నది. ఆ మధ్య త్రిష పెళ్లి చేసుకోబోతుందని, ఓ హీరోతో డేటింగ్ చేస్తుందని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అలాటివేమీ లేవని తేల్చి చెప్పింది త్రిష. ఈ మధ్య ఈ బ్యూటీ ఎక్కడ కనిపించిన మీడియా ముందు అడిగే ప్రశ్న పెళ్ళెపుడూ.. ? తాజాగా మరోసారి ఇదే ప్రశ్నను అమ్మడి ముందుంచితే .. ఇలా స్పందించింది. తన పెళ్లి విషయంలో కుటుంబ పెద్దలు చెప్పే మాటను వినబోనని తేల్చి చెప్పింది. వారు చూసే వరుడు తనకు వద్దని, ప్రేమ పెళ్లి చేసుకుంటానని .. తనకు కాబోయే భర్త తనను బాగా చూసుకునేవాడై ఉండాలని తెలిపింది. తనకు కాబోయే భర్త హీరో కానవసరం లేదని .. చాలా అందంగా ఉండాల్సిన పని లేదని చెప్పింది. మంచి వాడై ఉండాలని, తనను బాగా అర్థం చేసుకోవాలని అలాంటి వ్యక్తి తనకు పరిచయమైతే పెళ్లాడతానని వెల్లడించింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu