HomeTelugu TrendingTriptii Dimri: ఒక్క హిట్ కే నాలుగు కోట్లు పెంచేసిందా?

Triptii Dimri: ఒక్క హిట్ కే నాలుగు కోట్లు పెంచేసిందా?

Triptii Dimri hikes her remuneration
Triptii Dimri hikes her remuneration

Triptii Dimri Remuneration:

రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో.. సూపర్ హిట్ అయిన యానిమల్ సినిమాతో తృప్తి దిమ్రీ రేంజ్ ఒక్కరు సరిగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సక్సెస్ తో ముంబైలోని ఒక పాష్ ఏరియాలో పెద్ద ఫ్లాట్ కూడా కొన్నట్లు వార్తలు వినిపించాయి.

అప్పటిదాకా కంటెంట్ ఉన్న సినిమాల్లో కనిపించినా కూడా.. పెద్దగా అలరించలేకపోయిన తృప్తి.. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

తాజాగా విడుదలైన బ్యాడ్ న్యూస్ తో మరొక సక్సెస్ అందుకున్న త్రిప్తి దిమ్రీ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక బిజీ నటిగా మారింది. ఆనిమల్ సినిమాలో చేసిన ఆమె అద్భుత నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. త్రిప్తి ఇప్పుడు కెరియర్‌లో వేగంగా ఎదుగుతున్న నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది.

తాజా సమాచారం ప్రకారం, ఆమె తన పారితోషికాన్ని ఇప్పుడు రూ. 10 కోట్లకు పెంచిందని తెలుస్తోంది. ఇది ఆమె గతంలో తీసుకున్న రూ. 6 కోట్లతో పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇది త్రిప్తి కి ఉన్న క్రేజ్ కి, ఆమెకు పెరుగుతున్న డిమాండ్ కు ఒక చిన్న ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

Read More: Jani Master వివాదంలో కీలక మలుపు.. స్టార్ హీరో ఎంట్రీ

త్రిప్తి ప్రస్తుతం విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భులయ్యా 3, ధడక్ 2 వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇవి కాకుండా, ఆమె మరో పలు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu