
Bigg Boss 8 Telugu Love Story:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్ సోనియా అకుల తన ఆటతీరు వల్ల ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కొంటోంది. ఆమె వ్యూహాలు, వివాదాస్పద పనులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల నామినేషన్ సమయంలో విష్ణుప్రియతో జరిగిన గొడవ తర్వాత సోనియా మీద నెగిటివిటీ బాగా పెరిగిపోయింది.
సోనియా, విష్ణుప్రియపై చేసిన వ్యక్తిగత దాడులు ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాయి. విష్ణుప్రియ అసభ్యంగా డ్రెస్ వేసుకుంటుందని.. కుటుంబ నేపథ్యాన్ని కూడా ప్రశ్నించడంపై విమర్శలు వచ్చాయి. సోనియా గేమ్ ప్లాన్ బలమైన కంటెస్టెంట్లతో కలిసి ఉండటమేనని అనిపిస్తోంది. అందుకే షో ప్రారంభం నుండి ఆమె నిఖిల్‌కు దగ్గరగా ఉంది.
వీళ్ళిద్దరి మధ్య ప్రేమయడం కూడా మొదలవుతోంది అంటూ.. సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కానీ తాజాగా ఇప్పుడు మరొక కంటెస్టెంట్ ఈ ఇద్దరి ప్రేమ కథకి మధ్యలో వచ్చారు. అతనే ప్రిత్విరాజ్. సోనియా వీరిద్దరితో సన్నిహితంగా ఉండటం తన స్ట్రాటజీ అని కొందరు చెబుతున్నారు. టాప్ కంటెస్టెంట్లతో సంబంధాలు కొనసాగించడం ద్వారా గేమ్‌లో ఎక్కువ స్క్రీన్ టైం తెచ్చుకోవచ్చు అని ఆమె బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
Read More: Bigg Boss 8 Telugu ఇంట్లో ఉన్న రష్మిక మందన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?!
ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో స్నేహం ప్రేమ వంటి బంధాలు పెట్టుకుని.. ఫాన్ ఫాలోయింగ్ పెంచుకోవచ్చు అని.. నామినేషన్స్ నుంచి కూడా బయటపడవచ్చు అని సోనియా బాగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే బయట మాత్రం ఆమె మీద నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆమె స్ట్రాటజీలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో వేచి చూడాలి.