దేశవ్యాప్తంగా త్వరలో రైలు సర్వీసులు మొదలు కానున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జూన్ 1 నుంచి 200 నాన్ ఏసీ ప్యాసింజర్ రైళ్లు దేశ వ్యాప్తంగా నడపనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించి త్వరలోనే ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందన్నారు. వలసకార్మికుల కోసం మరో 200 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. తర్వాత దశలవారీగా రైలు సర్వీసుల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. గతంలోని రైల్వే టైం టేబుల్ ప్రకారమే రైళ్ల షెడ్యూల్ ఉంటుందన్నారు. రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఇస్తున్నామని, కౌంటర్ల ద్వారా బుకింగ్ అవకాశం లేదని అన్నారు. ఆన్ లైన్ లోనే బుకింగ్ అనుమతిస్తామన్నారు. దశల వారీగా రైలు సర్వీసుల సంఖ్యను పెంచుతామని తెలిపారు.