తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం జపాన్ . రాజు మురుగన్ డైరెక్షన్‌లో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన జపాన్ ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంట్రడక్షన్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి టచింగ్ టచింగ్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. రొమాంటిక్ అండ్ స్టైలిష్‌గా సాగుతున్న ఈ పాటను భాస్కరబట్ల రాయగా.. కార్తీ, ఇంద్రావతి చౌహాన్ పాడారు. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశాడు.
ఈ సినిమాలో కార్తీ పూర్తిగా డిఫరెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కార్తీ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. జపాన్ తెలుగు థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, అక్కినేని నాగార్జున హోంబ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది. ఈ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాని జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.