
Live Concert in SRH vs LSG Match:
హైదరాబాద్‌లో IPL 2025 సందడి కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయాన్ని సాధించి, 286 పరుగుల స్కోరుతో ఆరంభాన్ని ఘనంగా చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే ఉప్పల్ స్టేడియంలో మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ప్రత్యేకం కాబోతోంది. ఎందుకంటే, ఆట మొదలవ్వడానికి ముందే ఓ గ్రాండ్ మ్యూజిక్ షో జరగనుంది!
మ్యాచ్ ప్రారంభానికి ముందుగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఆయన OG, గుంటూరు కారం, డాకూ మహారాజ్, గేమ్ చేంజర్ వంటి హిట్ పాటలు పాడనున్నారు. ప్రత్యేకంగా, రామ్ చరణ్ పుట్టినరోజు ముందు రోజు కావడంతో ఈ ఈవెంట్ మరింత క్రేజ్ సంపాదించింది.
Siddharth Mahadevan is ready to set the stage on fire with his electrifying beats and unstoppable energy! 🎤 🔥
As we celebrate 18 years of #TATAIPL, get ready for a musical spectacle that will have you singing, dancing, and feeling the thrill like never before! 🥳
Don’t miss… pic.twitter.com/DIHEsjEzZq
— IndianPremierLeague (@IPL) March 23, 2025
థమన్ తన ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా స్టేజ్‌పై తనతో కలిసి రావాలని ట్యాగ్ చేశాడు. ఈ విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
BCCI ఈ సారి కొత్తగా IPL లో ప్రతి మ్యాచ్ ముందు మ్యూజిక్ షోలు ఏర్పాటు చేస్తోంది. ఇటీవల చెన్నైలో CSK vs MI మ్యాచ్‌కు ముందు అనిరుద్ రవిచందర్ లైవ్ షో చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో థమన్ శోభ పెంచనున్నారు.
మార్చి 27 రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుండగా, థమన్ మ్యూజిక్ షో దాదాపు గంట పాటు అభిమానులకు వినోదం అందించనుంది. ఒకేసారి క్రికెట్, మ్యూజిక్, SRH సపోర్ట్—all in one! హైదరాబాద్ ఫ్యాన్స్‌కి ఇది అన్‌ఫర్గెటబుల్ ఈవెంట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.