Bigg Boss 8 Telugu Top 3:
బిగ్ బాస్ తెలుగు 8 షో చివరి అంచుకు చేరుకుంది. డిసెంబర్ 15న జరిగే గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్, ఎన్నో మలుపులు, సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది.
ఫినాలే ముందు వారం ఇంటి సభ్యులకు పెద్ద షాక్ తగిలింది. రోహిణి, విష్ణుప్రియ డబుల్ ఎలిమినేషన్‌లో ఇంటి నుండి బయటకు వెళ్లారు. విష్ణు ప్రియ ఎలిమినేషన్ ఈరోజు ఎపిసోడ్స్‌లో ప్రసారం అవ్వనుంది. వీటితో పాటు టాప్ 5 ఫైనలిస్టులు అధికారికంగా ప్రకటించనున్నారు.
డబుల్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 5లో నిలిచిన ఫైనలిస్టులు:
1. అవినాష్ – మొదటి ఫైనలిస్ట్‌గా తన స్థానం ఖరారు చేసుకున్నారు.
2. నిఖిల్ – రెండో ఫైనలిస్ట్‌గా నిలవనున్నట్లు సమాచారం.
3. గౌతమ్ కృష్ణ – మూడో ఫైనలిస్ట్‌గా స్ట్రాంగ్ కంటెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
4. నబీల్ అఫ్రిది – గేమ్‌లో తన ప్లాన్స్ తో బాగానే ఆకట్టుకుంటున్నాడు.
5. ప్రేరణ – కష్టపడే స్వభావంతో ఫైనల్ లోకి అడుగుపెట్టారు.
ఇప్పటికే అవినాష్ ఫైనలే చేరుకోగా, నిఖిల్, గౌతమ్ అభిమానుల్లో పోటీ చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో నిఖిల్, గౌతమ్ మద్ధతుదారుల మధ్య హాట్ డిబేట్ జరుగుతోంది. టాప్ 3లో మరింత ఉత్కంఠ ఉండబోతోంది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే జరుగనుండగా, సీజన్ టైటిల్ ఎవరు గెలుస్తారనేది అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.