HomeTelugu Trendingఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 మూవీస్

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 మూవీస్

10a

ప్రతి సంవత్సరం టాలీవుడ్‌లో చిన్న, పెద్ద చిత్రాలు కలిసి సుమారుగా 200 వరకు చిత్రాలు విడుదలవుతుంటాయి. కొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోతే.. మరికొన్ని అత్యధిక కలెక్షన్స్ రాబడతాయి. మరికొన్ని టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించినవీ ఉన్నాయి. ఈ ఎడాది (2019)లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన టా-10 మూవీస్ ఏంటో చూద్దామా..!

1. సాహో: ‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో సినిమా కథ, కథనంలో లోపాలు ఉన్నప్పటికీ.. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండటం, ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌ సినిమాకు ప్లస్ అయింది. తెలుగులో అనుకున్న విజయం సాధించలేకపోయినా హిందీలో భారీగా వసూళ్లు రాబట్టింది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 433.06 కోట్లు రాబట్టి 2019లోనే అత్యధిక వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది.

10d

2. సైరా నరసింహా రెడ్డి: స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో నయనతార, అమితాబ్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. సురేంద్ర రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీ మినహా అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 250 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సెకండ్ మూవీగా నిలిచింది.

3.మహర్షి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం మహేష్ కెరీర్‌లోనే ఒక మైలురాయి. యాక్షన్, ఎమోషన్స్, సందేశాత్మకం అన్నీ సమపాళ్లలో కలగలిపి తెరకెక్కిన మూవీ మహర్షి. ఈ ఏడాది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ‘మహర్షి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్ల వసూళ్లు రాబట్టి టాప్ 3లో నిలిచింది.

4.ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్): విక్టరీ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘పెటా’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలను పక్కకు తోసి రేసులో ముందుకు పోయి ప్రేక్షకుల ఆదరణను అందుకుందీ సినిమా. పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.137.6 కోట్లు రాబట్టింది.

5.వినయ విధేయ రామ: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నటించిన సినిమా ‘వినయ విధేయ రామ’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా తెరకెక్కించారు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత అవి కాస్తా నీరు కారిపోయాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 97.9 కోట్లు వసూలు చేసింది. 2019 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది.

10b

6.ఇస్మార్ట్ శంకర్: డైరెక్టర్‌ పూరి జగన్నాధ్, హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా విడుదల కాకముందు పూరి జగన్నాధ్, హీరో రామ్ వరుస ప్లాప్స్‌తో సతమతమయ్యారు. అయితే ఈ మూవీ రిలీజైన మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఇద్దరి కెరియర్లకు మంచి హిట్‌ ఇచ్చింది. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా 2019లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 83 కోట్లు రాబట్టింది.

7.మజిలీ: అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. దివ్యన్ష కౌషిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. కుటుంబ కథలను రూపొందించడంలో మరోసారి తానేంటో నిరూపించుకున్న శివ నిర్వాణకు ఈ సినిమా సెకండ్ హిట్ ఇచ్చింది. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 70 కోట్లు రాబట్టింది.

8.జెర్సీ: నేచురల్ స్టార్ నాని, ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జెర్సీ ‘. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇది ‘వన్ అఫ్ ది బెస్ట్’ ఫిల్మ్‌గా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ‘అర్జున్’ పాత్రలోకి నాని పరకాయ ప్రవేశం చేసి మరీ జీవించాడని.. ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నానికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రూ. 51.70 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

10c

9.వెంకీ మామ: విక్టరీ హీరో వెంకటేష్, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు కెఎస్ రవీంద్ర తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలి ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి వెంకీ హైలైట్‌గా నిలిచాడు. రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో ఎమోషన్, కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది.

10.గద్దలకొండ గణేష్‌: తమిళ కల్ట్ మూవీ ‘జిగర్ తండా’ ఆధారంగా ‘గద్దలకొండ గణేష్’ తీశారు. పూర్తి నెగిటివ్ క్యారెక్టర్‌లో నటించిన వరుణ్ తేజ్.. ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. గ్యాంగ్‌స్టర్‌ రోల్‌లో జీవించాడని చెప్పాలి. అథర్వ మురళీ, మృణాళిని రవి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా పెద్ద హిట్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 42.5 కోట్లు రాబట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu