HomeTelugu Trending'తూనీగ' మూవీ ట్రైల‌ర్

‘తూనీగ’ మూవీ ట్రైల‌ర్

8 16వినీత్ చంద్ర, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ‘తూనీగ’ మూవీ ట్రైల‌ర్ విడుదలైంది. ‘వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణం, జీవించే ప్రతి జీవం, కారణమైన ఆ దైవం..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. మధ్యలో ఓ ఏలియన్‌ కూడా కనిపించింది. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. ‘ఈ భూ ప్రపంచానికి మహాప్రళయం రాబోతోంది’ అంటూ ట్రైలర్‌ ముగిసింది.

ప్రేమ్‌ సుప్రీమ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ స‌దాశివుని సంగీతం అందించారు. హరీశ్ సినిమాటోగ్రఫీ సమ‌కూర్చారు. ఆర్కే కుమార్ ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu