Bigg Boss 8 Telugu elimination:
Bigg Boss 8 Telugu లో తాజా ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రారంభం కావడంతో ఇంట్లోని పరిసరాలు మరింత రసవత్తరంగా మారాయి. ఆదివారం నయని పవనీ ఎలిమినేట్ అయ్యిన తర్వాత, ఈ వారం నామినేషన్లు ఎంతో ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా ఇద్దరిని నామినేట్ చేసే విధానానికి విరుద్ధంగా, ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను ఒక్కరినే నామినేట్ చేయమని చెప్పారు.
తాజా నామినేషన్స్ ఎపిసోడ్లో హరీతేజ, ప్రేరణ మధ్య ఉన్న కోల్డ్ వార్‌ను బిగ్ బాస్ ప్రేక్షకులకు స్పష్టంగా చూపించారు. ఇద్దరూ బలమైన కంటెస్టెంట్స్, హరీతేజ మొదటి సీజన్లో ఏడు సంవత్సరాల క్రితం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రస్తుత సీజన్లో ప్రేరణ తనకు ఉన్నంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.
అయితే, ప్రేరణ బిగ్ బాస్ టైటిల్‌కు సన్నిహితంగా ఉన్నా, హరీతేజ కూడా గెలిచే అవకాశం కోసం ఆమెతో పోటీ పడాలని నిర్ణయించుకుంది. గత వారం నామినేషన్స్ సమయంలో ప్రేరణ తనతో చెడుగా ప్రవర్తించిందని హరీతేజ కారణంగా చూపి నామినేట్ చేసింది. ప్రేరణ తన తరపున వివరణ ఇవ్వగా, హరీతేజ కొంత కఠినంగా ప్రవర్తించింది.. ఇది ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచింది.
తను ఇలా వివాదాస్పదంగా ప్రవర్తిస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరికి ప్రేరణ కూడా హరీతేజను నామినేట్ చేసింది. ఇరువురూ ఇదే చివరి నామినేషన్ అనుకుంటూ తమ వాదన ముగించారు.
మరోవైపు, నిఖిల్ తన స్నేహితురాలు యశ్మి కోసం గౌతమ్‌ను నామినేట్ చేయడంతో నిఖిల్ ఆట కూడా బయటపడింది. యశ్మిని అక్క అని పిలవవద్దని కోరినా గౌతమ్ అలాగే ప్రవర్తించాడని నిఖిల్ నామినేషన్ కారణం. ఈ సందర్భంలో అశ్వత్థామ అనే మాట కూడా వచ్చింది, దానికి గౌతమ్ స్పందిస్తూ, ఇప్పుడు ఆ పేరుతో తనకు ఇబ్బంది లేదని, “అశ్వత్థామ మళ్లీ ఇంట్లోకి వచ్చాడు” అని చెప్పాడు.
ALSO READ: Bigg Boss 8 Telugu తో నయని పావని ఎంత సంపాదించిందో తెలుసా?