ప్రపంచ వ్యాప్తంగా చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్ని ఆకట్టుకున్న కార్టూన్ షో ‘టామ్ అండ్ జెర్రీ’. ఇంత ప్రజాదరణ పొందిన యానిమేటెడ్ క్యారెక్టర్ బహుశా మళ్లీ చూడలేము. అలాంటి పాత్రలను సృష్టించిన దర్శకుడు జీన్ డిచ్ కన్నుమూశారు. 95 ఏళ్ల వయస్సున్న జీన్ డిచ్ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్‌లో ఎప్రిల్ 16 రాత్రి మరణించారు. అయితే ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈయన ముందు అమెరికా వైమానిక దళంలో పని చేసి అక్కడ్నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలతో బయటకి వచ్చారు. ఆ తర్వాత 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు.
చిత్ర కళలపై మక్కువ ఉండటంతో ఎక్కువతో అనేక కార్టూన్స్ గీసారు జీన్. ఈ క్రమంలోనే మన్రో అనే చిత్రం కూడా తెరకెక్కించారు. 1960లో బెస్టు యానిమేటెడ్ షార్ట్ ఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. సినిమాలు, సీరియల్స్‌తో బిజీ బిజీగా గడిపే ప్రేక్షకులని కార్టూన్ సీరియల్స్ వైపు ఆకర్షించేలా చేసిన ఘనత జీన్ డిచ్‌ది. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయనకి ఆస్కార్ అవార్డ్ కూడా లభించింది.