HomeTelugu Trendingఫస్ట్‌ హీరోయిన్‌తో.. టాలీవుడ్‌ యంగ్‌ హీరో పెళ్లి!

ఫస్ట్‌ హీరోయిన్‌తో.. టాలీవుడ్‌ యంగ్‌ హీరో పెళ్లి!

Tollywood young hero going

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని వార్తలు చక్కర్లు
కొడుతున్నాయి. ‘రాజావారు రాణిగారు’ సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్
తీసుకుంటూ ఉన్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో టాలీవుడ్‌ సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా నిలదొక్కుకున్నాడు.

ఆ సినిమాలో రహస్య గోరక్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఆమెను కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోనున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుని, రిలేషన్ షిప్‌లో ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. బుధవారం (మార్చి13) న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుందని సమాచారం.

కిరణ్ అబ్బవరం సోషల్‌ మీడియాలో ఎక్కువగా తన పర్సనల్ విషయాలను పంచుకోడు. వ్యక్తిగత విషయాలు బయటకు ఫోకస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా, ప్రైవేట్‌గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu