Tollywood vs Bollywood 2024 collections:
టాలీవుడ్ పరిశ్రమలో ప్రస్తుతం ఒక గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. తెలుగు సినిమాలు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు పొందుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ‘పుష్ప 2’, ‘కల్కి’, ‘దేవర’, ‘గుంటూరు కారం’ లాంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఈ సినిమాల విజయాలతో 2024లో టాలీవుడ్ రూ.8,000 కోట్లు వసూలు చేసింది.
అయితే ఆసక్తికరంగా బాలీవుడ్ పరిశ్రమ రూ.10,000 కోట్లు వసూలు చేసి టాప్‌లో ఉన్నా, టాలీవుడ్ తాజాగా వస్తున్న విజయాలతో గ్యాప్‌ను తగ్గిస్తోంది. టాలీవుడ్ సినిమా ప్రత్యేకత, ఎమోషనల్ డ్రామాలు, గ్రాండ్ విజువల్స్, సరికొత్త కథనాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ముఖ్యంగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి.
టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇప్పుడు ఇండియా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు.తెలుగు సినిమాలు సాధారణ కథల లాగా కాకుండా.. కొత్త మలుపులు ఇచ్చి ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటున్నాయి. హై-క్వాలిటీ విజువల్స్, కొత్త టెక్నాలజీ వాడకం కూడా టాలీవుడ్ సినిమాల రేంజ్‌ను పెంచింది.
ఇక టాలీవుడ్ ఒకరి తర్వాత ఒకరు సూపర్ హిట్లు అందిస్తుండడంతో టాలీవుడ్ ఇండియన్ సినిమా పరిశ్రమ మొత్తానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక 2025లో టాలీవుడ్ ఇంకా పెద్ద విజయాలు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ALSO READ: Bigg Boss Telugu OTT రెండవ సీజన్ నిజంగానే త్వరలో మొదలవుతుందా?