HomeTelugu NewsChief Minister On Silver Screen: ముఖ్యమంత్రులగా నటించిన హీరో హీరోయిన్‌లు వీళ్లే!

Chief Minister On Silver Screen: ముఖ్యమంత్రులగా నటించిన హీరో హీరోయిన్‌లు వీళ్లే!

Chief Minister on silver screenChief Minister on silver screen: తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయ నేపధ్యం వున్న సినిమాలు ఎన్నో వచ్చాయి. అందులో ముఖ్యమంత్రి పాత్ర వేసిన నటులు చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక అంతే కాకుండా నిజ జీవితంలో కూడా సినిమాల నుంచి వచ్చి, రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకు తెలుగు ప్రజలు ఎంతో ముద్దుగా పిలుచుకునే అన్నగారు ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సంచలనం సృష్టించారు. రియల్ లైఫ్ లో సీఎం అయిన ఎన్టీఆర్, రీల్ లైఫ్ లో మాత్రం ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు. కానీ ఈ కాలంలో ఎక్కువ మంది సీఎం పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆ స్టార్ నటులు ఎవరు? వారు నటించిన సినిమాలు ఏమిటి?అనే విషయాలు తెలుసుకుందాం..

కంగనా రనౌత్‌ : తలైవి సినిమాలో కంగనా రనౌత్ ఒకప్పటి హీరోయిన్ అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో సీఎం పాత్రలో చాలా అద్భుతంగా నటించింది.

బాలకృష్ణ: ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’.. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాలలో, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటించి మెప్పించారు.

మమ్ముట్టి: వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’లో ముఖ్యమంత్రి గా మమ్ముట్టి నటించారు. ఈ పాత్రకు ఆయన వందశాతం న్యాయం చేశాడు

సూర్య: ఎన్ జీ కే .. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో నందగోపాల్ కుమారునిగా ఓ సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేదే ఈ సినిమా స్టోరీ.

విజయ్‌ దేవరకొండ: ‘నోటా’లో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో ప్రేక్షకులను అలరించాడు.

మహేష్ బాబు: భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రేక్షకులని బాగా మెప్పించాడు.

రానా: ‘లీడర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానా ముఖ్యమంత్రి పాత్రలో కనపడతారు. ఈ రెండు సినిమాల కథలు రాజకీయ నేపధ్యంలో తీసి అందులో ఒకటి అవినీతి డబ్బును బయటకి తీయడానికి ఒకటి, ఓటు విలువ చాటి చెప్పే సినిమా ఇంకోటి, ఇలా ఈ రెండూ ఆలోచింపచేసేవిగా తీశారు.

జగపతి బాబు: 2009లో వి. సముద్ర దర్శకత్వంలో వచ్చిన అధినేత సినిమాలో జగపతి బాబు సీఎం క్యారెక్టర్ లో ప్రేక్షకులను బాగా మెప్పించాడు.

రక్త చరిత్ర :సీఎం ఎన్టీఆర్ పాత్రలో శత్రుఘ్న సిన్హా ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

భగీరథుడు : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆయన జీవిత చరిత్ర పై ఈ సినిమాను తెరకెక్కించారు.

ఉపేంద్ర: సూపర్.. ఉపేంద్ర నటించిన సినిమా చిత్రం ఇది. కన్నడలో విదేశాల నుంచి వచ్చిన ఒక ఎన్నారై సుభాష్ చంద్ర గాంధీ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అనే కథతో తెరకెక్కించారు.

అర్జున్‌: 1999లో ఒక్కరోజు సీఎం అనే కాన్సెప్ట్ తో అర్జున్ ముఖ్యమంత్రిగా అదరగొట్టాడు.

దాసరి నారాయణరావు: దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’. ఈ సినిమాలో దాసరి నారాయణ సీఎం పాత్రలో బాగా అలరించారు.

ఏఎన్నార్: 1989లో విడుదలైన రాజకీయ చదరంగం సినిమాలో ఏఎన్నార్ సీఎంగా కనిపించారు.

కృష్ణ:1984లో విడుదలైన ముఖ్యమంత్రి సినిమాలో కృష్ణ టైటిల్ పాత్రను పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu