HomeTelugu Big Stories2024 లో Tollywood నుండి మాయమైపోయిన స్టార్ హీరోయిన్!

2024 లో Tollywood నుండి మాయమైపోయిన స్టార్ హీరోయిన్!

Tollywood Star Heroine who completely disappeared in 2024!
Tollywood Star Heroine who completely disappeared in 2024!

Tollywood Heroine who disappeared in 2024:

పూజ హెగ్డే.. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌లో ఆమె ఒక టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. అప్పుడు ఏ సినిమా తీసుకున్నా, మొదటగా పూజా పేరే వినిపించేది. అంతేకాదు, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ కూడా పూజానే. కానీ 2024లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమాకు మొదట పూజానే హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, ఆమె స్థానంలో శ్రీలీల వచ్చింది. ఆ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత పూజాకు తెలుగులో ఇంకో సినిమా కూడా దొరకలేదు. శ్రీలీల వంటి కొత్త హీరోయిన్లు టాలీవుడ్ లో భారీ ఎత్తున సెటిల్ అయిన తర్వాత.. పూజాకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇక పూజా తన దారిని తమిళ పరిశ్రమలో ఆఫర్లు వెతుక్కుంటోంది. విజయ్, సూర్యలతో రెండు భారీ సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు హిట్ అయితే, ఆమెకు తమిళనాట క్రేజ్ మళ్లీ పెరుగుతుంది. బాలీవుడ్‌లో కూడా ఆమె ప్రయత్నాలు చేస్తోంది. షాహిద్ కపూర్‌తో రెండు సినిమాలకు సైన్ చేసింది. హిందీలో తన గ్లామర్ చూపించేందుకు సిద్ధంగా ఉంది.

ఇక టాలీవుడ్ గురించి మాట్లాడితే, పూజా ఇక్కడకు తిరిగి వస్తుందా అనేది చాలా మంది ప్రేక్షకుల మనసులో సందేహంగా ఉంది. 2025లో తెలుగు సినిమాల్లో పూజా మళ్లీ కనిపిస్తే, అది ఆమె కెరీర్‌కు మళ్లీ కొత్త మలుపు ఇస్తుందని చెప్పొచ్చు. మరి పూజా ప్రయాణం ఎటువైపు తిరుగుతుందో చూద్దాం!

ALSO READ: 2024 National Award రేస్ లో పాల్గొనే అవకాశం ఉన్న నలుగురు నటులు ఎవరంటే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu