HomeTelugu Big Storiesనిశ్చితార్ధం చేసుకున్న సింగర్‌ సునీత

నిశ్చితార్ధం చేసుకున్న సింగర్‌ సునీత

Singer sunitha got engaged
టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం గురించి గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం ఆమె నిశ్చితార్థం సమాచారం. ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే ఆమె తెలుగు డిజిటల్ మీడియాలోని ఒక వ్యాపారవేతతో నిశ్చితార్ధం చేసుకున్నారు. కాగా సునీత చిన్న వయసులోనే టాలీవుడ్‌లో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి కూడా చిన్న వయస్సులోనే జరిగిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమెకు భర్తకు పడకపోవడంతో ఆమె భర్త నుండి విడాకులు తీసుకున్నారు. ఆమె వివాహం చేసుకోబోతున్న వ్యక్తికి కూడా రెండో పెళ్లి అని తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌ వల్ల కేవలం రెండు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ ఉదయం శుభకార్యానికి హాజరయ్యారని సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్‌ వైరల్‌ అవుతున్నాయి. సునీత నిశ్చితార్థానికి సంబంధించి కానీ పెళ్లికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Singer sunitha got engaged

Recent Articles English

Gallery

Recent Articles Telugu