ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, ఇండియన్ ఐడల్ రన్నరప్ కారుణ్య ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి జానకి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 70 యేళ్లు. గత కొన్నేళ్లుగా కారుణ్య తల్లి కాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆమె అరోగ్యం క్షీణించడంతో ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. . కారుణ్య తల్లి జానకి.. సెంట్రల్ గవర్నమెంట్‌కు చెందిన బీడీఎల్‌లో ఉద్యోగం చేసిన రిటైర్ అయ్యారు. కారుణ్య తండ్రి మధు కూడా కేంద్ర రక్షణ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. కరోనా కారణంగా కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో కారుణ్య తల్లి అంత్యక్రియలు సైదాబాద్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించారు.