HomeTelugu Trendingతెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.....ప్రముఖ నిర్మాత కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం…..ప్రముఖ నిర్మాత కన్నుమూత

image 24

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

రామకృష్ణారెడ్డి 1948 మార్చి 8న నెల్లూరు జిల్లాలోని గూడూరులో జన్మించారు. శ్రీమతి మస్తానమ్మ, ఎం.సుబ్బరామిరెడ్డి వారి తల్లిదండ్రులు. చదువు పూర్తయ్యాక కొంతకాలం సిమెంట్‌ రేకుల వ్యాపారాన్ని చూసుకున్న ఆయన తన బంధువు ఎంఎస్‌ రెడ్డి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
1973లో శ్రీరామకృష్ణా ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి రంగనాథ్, శారద జంటగా అభిమానవంతులు అనే చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఎస్వీ రంగారావు, రాజబాబు, అంజలీదేవి, రమాప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే చిత్రం ద్వారా శోభానాయుడు, ఫటా ఫట్ జయలక్ష్మిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సీతాపతి సంసారం, వైకుంఠపాళి, గడుసుపిల్లోడు, మావూరి దేవత, కృష్ణ హీరోగా అగ్ని కెరటాలు, శోభన్ బాబు హీరోగా అల్లుడు గారు జిందాబాద్ తదితర చిత్రాలు నిర్మించారు. వాకాడ అప్పారావుతో కలిసి చంద్ర మోహన్ హీరోగా మూడిళ్ల ముచ్చట చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu