HomeTelugu Trendingక్యాస్టింగ్‌ కౌచ్‌పై అన్నపూర్ణ కామెంట్స్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌పై అన్నపూర్ణ కామెంట్స్‌

Tollywood senior actress an

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తున్న ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తప్పు ఎప్పుడూ ఒకరివైపే ఉండదని, కొన్నిసార్లు ఇద్దరి అంగీకారంతోనే తప్పులు జరుగుతుంటాయని చెప్పారు. ఏ రంగంలో ఉన్నా మహిళలకు ఇలాంటివి తప్పవన్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం అనవసరమని కొట్టిపడేశారు.

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చినప్పుడు రెండు వైపుల నుంచి ఆలోచించాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటివి ఎదుర్కొంటే వెంటనే వాటిని బయటపెట్టాలని సూచించారు. తప్పులు జరగబోవని తాను చెప్పడం లేదని, కొన్నిసార్లు ఇద్దరికీ ఇష్టమైతేనే జరుగుతాయని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. ఇలాంటివి ఎదురైనప్పుడు మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu