HomeTelugu Big Storiesఏడున్నర కోట్లు మోసం.. ఆ వ్యక్తిపై కేసు పెట్టిన సీనియర్‌ నరేష్‌

ఏడున్నర కోట్లు మోసం.. ఆ వ్యక్తిపై కేసు పెట్టిన సీనియర్‌ నరేష్‌

Tollywood senior actor nare
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మెట్లెక్కారు. ఆయన కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి ఫైనాన్స్ కంపెనీని నడుపుతున్నారు. అతడు అడగటంతో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలను హ్యాండ్ ఫైనాన్స్ రూపంలో నరేష్ ఇచ్చాడు. దాదాపు ఆరేళ్ల క్రితం ఆ డబ్బులను ఇచ్చాడు. అప్పటి నుంచి పలుమార్లు ఆ డబ్బు గురించి అడిగినా సమాధానం దాటవేస్తున్నాడు. ఆ డబ్బు ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఎన్నిసార్లు, ఎన్ని రూపాల్లో అడిగినా, పలువురు పెద్దల మధ్యవర్తిత్వంతో డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా చెప్పినప్పటికీ ఆ వ్యక్తి లక్ష్యపెట్టలేదు. దీంతో తనను మోసం చేశాడంటూ ఆ వ్యక్తిపై సీసీఎస్ పోలీసులకు నరేష్ ఫిర్యాదు చేశాడు. ‘నా దగ్గర ఫైనాన్స్ రూపంలో రూ.7.50 కోట్లు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి దాదాపుగా రూ.10 కోట్లు అవుతుంది. వడ్డీ కాదు కదా అసలు డబ్బును అడిగినా కూడా పట్టించుకోవడం లేదు. అతడిపై మోసం కేసు నమోదు చేసి నా డబ్బును నాకు తిరిగి ఇప్పించండి‘ అని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని నరేష్ వ్యాఖ్యానించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu