Kalki 2898 AD: పాన్ ఇండియా హీరో ప్రభాస్ -నాగ్ అశ్విని కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ భారీ బడ్జెట్ మూవీలో స్టార్ నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా పలువురు స్టార్స్‌తో కల్కి తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ యాక్టర్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ‘కలియుగ పట్నం’ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా ప్రభాస్‌తో మొదటిసారి కలిసి పనిచేస్తున్నట్లుగా రాజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. అయితే తన పాత్ర గురించి మాత్రం రివీల్ చేయలేదు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 9 థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న దీపికా ప్రెగ్నెన్సీ వల్ల కల్కి షూటింగ్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందేమోనని ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు. అయితే ఈ సినిమాలో దీపికా తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసిందని సమాచారం. కేవలం తన పాత్రకి డబ్బింగ్ మాత్రమే చెప్పాల్సి ఉందట. కనుక దీపిక వల్ల కల్కికి ఎలాంటి అడ్డు లేదని అంటున్నారు. ఇలాంటి సినిమా ఇప్పటివరకూ ఇండియాలో ఎవరూ తీయలేదు, ఖచ్చితంగా ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అని డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి