టాలీవుడ్ హీరో పవన్‌కల్యాణ్ ని ఈ రోజు ఉదయం నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు విజయవాడ పవన్ కళ్యాణ్ ఇంట్లో కలిశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
వీరంతా ఇటీవల ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిని కలిసి చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, ఆన్‌లైన్ టికెటింగ్ గురించి విన్నవించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని తామే కోరినట్టు ఆ సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో వారు పవన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.