ప్రముఖ తెలుగు చిత్రాల నిర్మాత, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత జె. వి. ఫణీంద్ర రెడ్డి (వెంకట్) అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు.వెంకట్ మూత్ర పిండ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకట్ వయసు 57 సంవత్సరాలు తెలుగులో ది ఎండ్ , సామాన్యుడు, మాయాజాలం ,హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్ ,ప్రేమ కావాలి, డాన్ శ్రీను ,పైసా , ఢమరుకం, బిజినెస్ మన్ , లవ్లీ , విక్టరీ , ఇంగ్లిష్ లో డివోర్స్ ఇన్విటేషన్ చిత్రాలను నిర్మించారు.
వెంకట్ ప్రతి సినిమా విడుదల సందర్భగా సేవా సంస్థలకు ఐదు లక్షల రూపాయలను అందించేవారు.
సినిమా అంటే ఎంతో మక్కువ వున్న వెంకట్ ప్రచారానికి దూరంగా ఉండేవారు . ఆయన ఫోటో కూడా ఎవరికీ తెలియదు. తెరవెనుక వుండే వెంకట్ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. అలానే నిర్మాత రమేశ్ పుప్పాల నేతృత్వంలోనూ వెంకట్ కొన్ని చిత్రాలను నిర్మించారు. వెంకట్ మృతిపట్ల సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.