కరోనా మహమ్మారి సోకి తెలుగు నిర్మాత పోకూరి రామారావు(64) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ తరం ఫిలింస్‌లో ఎన్నో సినిమాలను నిర్మించిన పోకూరి బాబూరావు సోదరుడు పోకూరి రామారావు. ఈతరం ఫిలింస్ బ్యానర్‌లో చిత్ర సమర్పకుడిగా వ్యవహరించారు. 80వ దశకంలో టి.కృష్ణ దర్శకత్వంలో ఎన్నో ఆదర్శవంతమైన సినిమాలు నిర్మించారు. ఈ జనరేషన్‌లో గోపీచంద్ తో ఒంటరి, రణం వంటి సినిమాలు నిర్మించారు.