Tollywood Movie Records:
టాలీవుడ్ ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల ఉన్న ఇండస్ట్రీ. ఓపెనింగ్‌లు, ఇతర మార్కెట్లలో, విదేశాల్లో ఓపెనింగ్‌లు ఇలా అన్నిటిలో రికార్డులు సృష్టించడం టాలీవుడ్‌కు కామన్ అయిపోయింది. కానీ, ఈ పరిశ్రమలో ఒక ప్రధాన విషయం మిస్ అవుతోంది అని కొందరు భావిస్తున్నారు.
అదే యినానిమస్ పాజిటివ్ టాక్. టాలీవుడ్‌లో ఈ మధ్య విడుదలైన పెద్ద చిత్రాల గురించి మాట్లాడాలంటే, ‘సలార్’, ‘గుంటూర్ కారం’, ‘కల్కి’, ‘దేవర’ ఇలా చాలా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యాయి. కానీ, ఆశ్చర్యంగా, వీటిలో ఒకటి కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రారంభం కాలేదు.
‘గుంటూర్ కారం’ని మినహాయించి, మిగిలిన చిత్రాలు కలెక్షన్లు సంపాదించినప్పటికీ, పూర్తి పాజిటివ్ రివ్యూలు మాత్రం అందుకోలేదు. వేలెత్తి చూపడానికి ఒక్క మచ్చ కూడా లేని సినిమాలు ఉండవు. కానీ కనీసం టాక్ లో సగం కంటే ఎక్కువ శాతం అయినా పాజిటివ్ టాక్ వినపడాలి. కానీ ఈ మధ్య పెద్ద సినిమాలు అన్నీ మిక్స్డ్ టాక్ తోనే ఓపెన్ అవుతున్నాయి.. కలెక్షన్లు కూడా అందుకుంటున్నాయి.
రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ పవర్‌తో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి కూడా మొదటిరోజున మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే రాంగస్థలం మాత్రమే పూర్తి పాజిటివ్ టాక్ తో ప్రారంభమై, మంచి విజయం సాధించింది.
పాన్-ఇండియన్ ట్రెండ్ ప్రారంభమైనప్పటి నుంచి, నిర్మాణాలు పెద్ద స్థాయిలో పటిష్టమవుతున్నాయి, ఇండస్ట్రీ రూపు రేఖలు కూడా కొత్త దారులు తీసుకుంటున్నాయి. మరి ఇకపై రానున్న టాలీవుడ్ చిత్రాలు ఏమైనా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రివ్యూస్ అందుకుంటాయో లేదో అని చూడాలి.
Read More: విడుదల తేదీలు మార్చుకుంటున్న Mega Heroes