Tollywood Heroes: ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. తెలుగు హీరోల హవా నడుస్తుంది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా.. పాన్ఇండియా స్థాయిలో తెలుగు హీరోల సినిమాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు వందల కోట్ల లాభలను రాబడుతున్నాయి. భారీ బడ్జెట్లతో రూపొందున్న.. ఈ సినిమాలకు మన హీరోలు అదే రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఏ హీరో పారితోషకం తీసుకుంటున్నడంటే..
ప్రభాస్:
రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్.. ఒక్కో సినిమాకు రూ. 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్- నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి గాను ప్రభాస్ 200 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడట. ఈ మూవీలో పలువురు స్టార్ నటీనటులు కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలై అమితాబ్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా పలు ప్యాన్ ఇండియా మూవీలు ఆయన చేతిలో ఉన్నాయి.
అల్లు అర్జున్
పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. ప్రస్తుతం పుష్ప-2 చేస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈమూవీ కోసం అల్లు అర్జున్ 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాట్లు టాక్. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
రామ్ చరణ్
‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమా తరువాత ఆయన రేంజ్ మారిపోయింది. పలు అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత బుచ్చి బాబు సన డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి గాను రామ్‌చరణ్ 130 కోట్లు వసూల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని తరువాత సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.
ఎన్టీఆర్
ఎన్టీఆర్‌కి కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ రెమ్యురేషన్ భారీగా పెంచేసిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తెలుగులో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనిలో పాటు బాలీవుడ్ మూవీ వార్ 2లో కూడా నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ 120 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
మహేష్ బాబు
మహేష్ బాబు ఇప్పటి వరకూ ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చెయ్యాలేదు. అయిన ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా రాజమౌళి- మహేష్ తొలి పాన్ ఇండియా మూవీకి రెడీ అయ్యాడు. ఈ సినిమాకి సినిమా కోసం ఏకంగా రూ. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు.