టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ఓటీటీలో విడుదలైన ఓరేయ్ బుజ్జి కూడా పెద్దగా గుర్తింపు పొందలేదు. తాజాగా స్టాండ్ అప్ రాహుల్ సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో సొంత ఇంటిని కొనుగొలు చేసిన రాజ్ తరుణ్, త్వరలో పెళ్లి చేసుకోని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. దానికి తగ్గట్లు అతడు త్వరలోనే పెళ్లికి సిద్దమవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే గతంలో రాజ్ తరుణ్ విజయవాడకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెతో ఈ కుర్ర హీరో ఏడడుగులు వేయనున్నాడేమోనని అందరు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు.