టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. వరుస విజయాలతో దూకుడుపోతున్నాడు. ఇక ఇప్పుడు వ్యాపారరంగంలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హంబుల్ బ్రాండ్ దుస్తులను పార్క్ హయత్‌లో బుధవారం అట్టహాసంగా ఆవిష్కరించారు. స్పోయల్ సంస్థతో కలిసి హంబుల్ బ్రాండ్ పేరుతో 160 రకాల దుస్తులను వినియోగదారుల అందుబాటులోకి తెచ్చారు. యువకుల నుంచి వృద్ధుల దాకా ఆకర్షణీయంగా, అందుబాటు ధరలో క్యాజువల్ షర్ట్స్ , టీ-షర్టులను అందిస్తోంది.