
Tollywood vs Bollywood:
ప్రభాస్ డైరెక్ట గా ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా సోషల్ మీడియా లో ఒక పెద్ద యుద్ధానికి కారణమయ్యాడు. ఇది ఏకంగా టాలీవుడ్, బాలీవుడ్ అభిమానుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి అసలు ముఖ్య కారణం బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.
ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తను కల్కి సినిమాని చూసాను కానీ అసలు నచ్చలేదు అని, ప్రభాస్ జోకర్ లా కనిపించారు అని చెప్పారు. ఈ కామెంట్ తో టాలీవుడ్, బాలీవుడ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద గొడవ మొదలైంది.
ప్రస్తుతం ఈ వివాదం చాలా తీవ్రంగా కొనసాగుతుంది. ముఖ్యంగా, అభిమానులు ప్రభాస్, షారుఖ్ ఖాన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు పోల్చుకుంటూ, ఈ రెండు పరిశ్రమల గురించి గట్టిగానే వాదిస్తున్నారు. ఈ వివాదం కేవలం అభిమానుల మధ్యనే కాదు, ప్రముఖుల మధ్య కూడా సృష్టమైంది.
ఇలాంటి పరిస్తితిలో, నటుడు నాని ప్రభాస్‌కు మద్దతుగా మాట్లాడాయు. అర్షద్ వార్సి తన కామెంట్ ద్వారా ఎక్కువ పాపులారిటీ పొందుతున్నాడని, అతడికి ఇంత ప్రచారం ఇవ్వడం సరికాదని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాని ఈ వ్యాఖ్యలు చేయగానే, బాలీవుడ్ అభిమానులు నానిపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నాని అర్హత ఏమిటి? తన స్థానంతో అర్షద్‌ని విమర్శించటానికి నానికి ఏమి హక్కు ఉంది? అంటూ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో నాని చాలా తక్కువ సమయంలో తనకంటూ సృష్టించుకున్న లెగసీ ఇన్నేళ్లలో బాలీవుడ్‌లో అర్షద్ సృష్టించుకోలేక పోయారు. అసలు ప్రభాస్ సినిమాల మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా అర్షద్ వార్సి అనుభవం కంటే పెద్దదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇంకా ఎంత వరకు వెళ్ళుతుంది అనేది చూడాలి.