టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. నేడు (సెప్టెంబర్7)న నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు ఈడీ ఎదుట హాజరయ్యారు. నిజానికి ఈనెల 20న నందు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత కారణాలతో నేడు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ముఖ్యంగా మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో నందును విచారిస్తున్నట్లు తెలుస్తుంది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు నందును విచారిస్తున్నారు. ఈ క్రమంలో చార్మీ, రకుల్‌తో పరిచయాలు, ఎఫ్ క్లబ్‌తో ఉన్న సంబంధాలపై నందుపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. గతంలోనూ 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణను సైతం నందు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ చార్మీ, రకుల్ ఈడీ విచారణను ఎదుర్కున్నారు.