HomeTelugu Big StoriesTollywood Directors: డైరెక్టర్స్..యాక్టర్స్ అయిన వేళ

Tollywood Directors: డైరెక్టర్స్..యాక్టర్స్ అయిన వేళ

Tollywood Directors

Tollywood Directors: ఒక సినిమాని తీర్చిదిద్దడంలో దర్శకుడిదే కీలక పాత్ర. సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు, పలు క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టులు మాత్రమే తెర మీద కనిపిస్తారు. కానీ అసలైన సూత్రదారి దర్శకుడు మాత్రం తెర వెనుకే ఉంటాడు. అయితే కొందరు దర్శకులు మాత్రం తమ సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇప్పటి వరకూ పలు డైరెక్టర్స్‌ వారి సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.

పూరీ జగన్నాథ్: ఈ మాస్ డైరెక్టర్‌ మహేష్ బాబు హీరోగా వచ్చిన బిజినెస్ మ్యాన్ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. టాక్సీడ్రైవర్ గా వచ్చి హీరోయిన్ ను కిడ్నాప్ చేసే సీన్ లో కనిపిస్తాడు. ఎన్టీఆర్ మూవీ టెంపర్, రామ్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లోనూ కనిపించాడు.

శేఖర్ కమ్ముల: క్లాసిక్‌ డైరెక్టర్‌ పేరు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ముల కూడా తన సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ‘ఆనంద్’ మూవీలో ఆటో డ్రైవర్ గా చేశాడు. అటు లీడర్ సినిమాలోనూ తెరపై మెరిశాడు.

రాజమౌళి: దర్శకధీరుడు రాజమౌళి కూడా పలు సినిమాల్లో కనిపించాడు. మొదటిసారి సై సినిమాలో కనిపించాడు. తర్వాత ఆయన ప్రతిష్టత్మకంగా నిర్మించి పాన్‌ ఇండియా మూవీ బాహుబలి సినిమాలో కల్లు అమ్మే వ్యక్తి పాత్రలో కనిపించాడు.

వి.వి. వినాయక్: ఈ డైరెక్టర్‌ కూడా పలు సినిమాల్లో నటించాడు. తొలిసారి చిరంజీవి సినిమా ఠాగూర్ లో కనిపించాడు. ఆ మూవీలో చిరంజీవి స్టూడెంట్‌గా చేశాడు. ఆ తర్వాత మళ్లీ చిరు సినిమా అయిన ఖైదీ నెం 150లో కనిపించాడు. వినాయక్ హీరోగా సీనయ్య అనే సినిమా కూడా చేశాడు.

శ్రీకాంత్ అడ్డాల: ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సైతం రెండు సినిమాల్లో కనిపించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాల్లో చిన్న గెటప్ వేశారు. ఈ రెండు సినిమాలు సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటించారు.

క్రిష్: వేదం సినిమాలో స్వామీజీ క్యారెక్టర్ చేశాడు క్రిష్.

శ్రీను వైట్ల: తను దర్శకత్వం వహించిన దుబాయ్ శ్రీను మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు శ్రీను వైట్ల.

సురేందర్ రెడ్డి: రవితేజ హీరోగా నటించిన ‘కిక్ 2’ మూవీలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ చిన్న పాత్రలో మెరిసాడు.

సందీప్‌ రెడ్డి వంగా: దర్శకుడిగా పరిచయమైన తొలి సినిమా అర్జున్‌ రెడ్డి మూవీలో కనిపించారు సందీప్‌ రెడ్డి.

ఓంకార్‌: రాజు గారి గది సినిమాలో ఓ రోల్ చేశాడు ఓంకార్. పలు సినిమాల్లో కూడా అతిథి పాత్రలు చేశాడు.

అనుదీప్‌: తన దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాడు అనుదీప్.

నందిని రెడ్డి: నందిని రెడ్డి తాను దర్శకత్వం వహించే పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరుస్తుంది.

వేణు: బలగం సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఆ సినిమాలో ఓ పాత్రలో నటించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu