కరోనా ఎఫెక్ట్‌తో షూటింగులు వాయిదా పడడంతో ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులను ఆదుకునేందుకు డైరెక్టర్ వీవీ వినాయక్ ముందుకొచ్చారు. తన వంతు సాయంగా రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు కాదంబరి కిరణ్‌కు చెక్కును అందించనున్నట్టు తెలిపారు. నిత్యావసర సరుకులు అవసరమైన వారు కిరణ్‌ను సంప్రదించాలని సూచించారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అందరం ఇళ్లలోనే ఉండి ఆ మహమ్మారిని వణికించాలని వినాయక్ పిలుపునిచ్చారు. షూటింగులు లేకపోవడంతో పరిశ్రమలోని పేద కళాకారులు, ఫైటర్లు, డ్యాన్స్ మాస్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి అందించాలని కోరుతూ కాదంబరి కిరణ్‌కు రూ. 5 లక్షలు ఇస్తున్నానని, అవసరమైన వారు ఆయనను సంప్రదించాలని వినాయక్ కోరారు.