Sreenu Vaitla planning Venky sequel: టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి సినిమాలతో భారీ హిట్‌లను అందుకున్నాడు. ఆతరువాత వరుస ఫ్లాప్‌లను ఎదుర్కున్నాడు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత శ్రీను వైట్ల నాలుగేళ్లకు పైగా గ్యాప్ ఇచ్చాడు.
తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో ‘వెంకీ సినిమా సీక్వెల్’ పై స్పందించారు. ‘వెంకీ సినిమా రీరిలీజ్ కి వచ్చిన స్పందన చూసి నాకు వెంకీ-2 చేయాలనిపించింది. ప్రస్తుతం వెంకీ సీక్వెల్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది, కానీ ఎప్పుడని చెప్పలేను’ అంటూ శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా 2004లో వచ్చిన వెంకీ సినిమా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఆ సినిమాలో కామెడీ ట్రాక్స్ సూపర్ హిట్ అయ్యాయి. రవితేజ, బ్రహ్మానందం మధ్య ట్రైయిన్ సీన్‌లకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇటీవలే ఈ సినిమా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. థియేటర్స్‌లో ఈసీన్ వచ్చినప్పుడు ఓ రెంజ్‌లో స్పందన వచ్చింది. అందుకే, ఇప్పుడు వెంకీ సినిమా సీక్వెల్ పై శ్రీను వైట్ల ఫోకస్ పెట్టాడట. మరి ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.