థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ సినీ పరిశ్రమలో ఫేమస్ అయిన నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నట్లు ఈ మేరకు ఆయనే స్వయంగా ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోరుకుంటున్నానంటూ ఆ వీడియోలో ఆవేదన చెందుతూ మాట్లాడారు. లాక్ డౌన్‌తో చాలాకాలం ఇంటికే పరిమితమైన పృథ్వీరాజ్ తర్వాత ఇచ్చిన సడలింపులతో బయటకు వచ్చారు. కొన్ని షూటింగ్స్ లో కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.