HomeTelugu Big Storiesఓటింగ్లో పాల్గొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి: టాలీవుడ్‌ సెలబ్రిటీలు

ఓటింగ్లో పాల్గొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి: టాలీవుడ్‌ సెలబ్రిటీలు

10 5తెలంగాణ ఎన్నికల పోలింగ్ రేపు 7వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల్లో క్రిందటి ఎడాది కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని ఎన్నికల కమీషన్ భావిస్తోంది. అందుకే రకరకాలుగా ఓటింగ్ ప్రాధాన్యం గురించి ప్రజలకు చెబుతోంది. ఇక తెలుగు సినీ సెలబ్రిటీలు సైతం తమ భాద్యతగా ప్రజలకు ఓటింగ్లో పాల్గొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోమని సూచిస్తున్నారు. ఇప్పటికే పవన్ ఓటింగ్ గురించి వీడియో మెసేజ్ ఇవ్వగా ఇప్పుడు మంచు మనోజ్, విజయ్ దేవరకొండ, నితిన్, కొరటాల శివ, సుమంత్‌, రకుల్‌ప్రీతిసింగ్‌, ఆర్యన్‌ రాజేష్ కూడ ప్రజల్ని ఓటింగ్లో పాల్గొనమని చెబుతున్నారు.

‘చాలామంది ఓటు ఎందుకు వేయాలని భావిస్తుంటారు. అది చాలా తప్పు. గంటసేపు క్యూలో నిల్చొని మంచి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల అయిదేళ్లు హాయిగా ఉండొచ్చు. నా ఒక్క ఓటు వల్ల ఏమీ మారదు కదా అన్న భావన అసలే వద్దు. ఒక్కో పరుగు కలిస్తేనే శతకం సాధించొచ్చు. మీరు ఓటేయండి. మీ చుట్టుపక్కల వారినీ ప్రేరేపించండి. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కును అంతా వినియోగించుకుందాం.’- సుమంత్‌, సినీహీరో

‘ఓటు అనేది దేశ, రాష్ట్ర భవిష్యత్తును మార్చగల ఆయుధం. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు, అధికారాన్ని కోల్పోతాం. ప్రతి ఓటూ విలువైనదే. అందుకే అందరూ ఈ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. వేసే ముందు ఆలోచించి అర్హుడైన అభ్యర్థిని ఎన్నుకోవాలి’ – రకుల్‌ప్రీతిసింగ్‌, నటి

’18 ఏళ్లు దాటి, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మనందరి బాధ్యత. ఓటు వేయకుండా సమస్యల గురించి నాయకులను ప్రశ్నించలేం. తొలిసారి ఓటు వేసిన సమయంలో నేను చాలా అనుభూతి చెందాను. ఒక నాయకుడిని ఎన్నుకోవడంలో నా పాత్ర కూడా ఉందన్న భావన కలిగింది’ – ఆర్యన్‌ రాజేష్, సినీహీరో

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu