హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్‌లో హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటన పై పలువు ప్రముఖులు స్పందించారు.
పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం సంతాపం తెలిపారు. ఈ ఘటనపై ప్రముఖ నటి అనుష్క స్పందిస్తూ.. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయని ఆమె అన్నారు. సమాజంలో మహిళగా పుట్టడం నేరమా అని అనుష్క ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ భావోద్వేగపు పోస్ట్ పెట్టారు. ‘అమాయకురాలైన ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఇది మానవాళిని కదిలించే ఓ విషాదకరమైన ఘటన. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి సిగ్గుపడతాయి. మన సమాజంలో ఒక మహిళగా పుట్టడం నేరమా?. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారికి వెంటనే శిక్షపడే విధంగా మనమందరం పోరాటం చేద్దాం. ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను. #RIPPriyanka Reddy’ అని అనుష్క పేర్కొన్నారు.
#RIPPriyankaReddy #JusticeForPriyankaReddy pic.twitter.com/9vCKsbsj1O
— Keerthy Suresh (@KeerthyOfficial) November 29, 2019
కీర్తి సురేష్ కూడా.. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరిన కీర్తి… ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం విన్నాక గుండె పగిలినంత పనైందన్న పేర్కోంది. పరిస్థితులు రోజురోజుకూ భయానకంగా తయారయ్యాయి. సూపర్ సేఫ్ సిటీగా భావించే హైదరాబాద్ లోనే ఇలాంటి దారుణం జరిగిందంటే ఎవరిని నిందించాలి. ఈ దారుణానికి పాల్పడిన క్రూరులని వేటాడి శిక్షించాలంటూ తన ఆక్రోషాన్ని తెలిపింది. అంతేకాకుండా ప్రియాంక రెడ్డి కుటుంభ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నాను.. అంటూ కీర్తి భావోద్వేగ పోస్ట్ చేసింది.
దోషులను శిక్షించకుండా.. మనం RIP అని చెప్పినంత మాత్రాన ప్రియాంక ఆత్మకు శాంతి కలుగుతుందా అని హీరో నాని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘ఇప్పటివరకూ దోషులెవరో గుర్తించకుండా వారిని శిక్షించి, న్యాయం చేయమని ఏవిధంగా డిమాండ్ చేయగలం. దోషులను శిక్షించకుండా RIP అని చెప్పినంత మాత్రాన ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరుతుందా..? చాలా కోపంగా, నిస్సహాయంగా ఫీల్ అవుతున్నాను. మీడియా వారు సంయమనం పాటించాలని కోరుతున్నాను. #PriyankaReddy’ అని నాని పేర్కొన్నారు.